Customs in work ..found in eenadu daily

కష్టపడే కస్టంస్ ... కనపడింది 'ఈనాడు ' లో

India's largest circulating telugu news daily Eenadu - The heart and soul of Andhra Pradesh has published a news  about Central excise and customs - Eluru  last week while doing their routine duty.

ఈనాడు ...అవును ఇది ఆంద్రా ప్రజల గుండెచప్పుడు అనటం లో అతిశయోక్తి ఎమీ లేదు. ఈనాడు చదవటం తోనే, 90 % అంధ్రా ప్రజల రోజు మొదలవుతుంది అంటే వినే వాల్లకి వింత గా ఉన్నా, తెలిసిన వాల్లకి తేటతెల్లమే. అంధ్రా లో ఉండే అంధ్రుల మాట పక్కన పెడితే పొరుగు రాష్ట్రాల లో ఉంటూ కూడా ఈనాడు చదవనిదే కానీ ఆఫీసు కార్యక్రమాలని మొదలు పెట్టను అని ఒట్టు పెట్టుకునే నా లాంటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎంతో మంది ఉన్నారు.ఇక ఈ రెంటి కన్నా అతి పెద్ద వింత ఎమిటంటే, విదేశాలలో ఉండే ఆంధ్రియులు సైతం సొంత గడ్డ మీద జరిగే సమాచారం ఈనాడు లో చదవక పొతే విల విల లాడి పొతారు అంటె నమ్మండి. ఇంటర్నెట్ పుణ్యమా అంటూ రమోజీ రావు గారి ముందు చూపు తో ఇప్పుడు కేవలం కంప్యుటెర్ ముందు కూర్చుకుని ఒక్క మౌస్ క్లిక్ తో పేపెర్ చదవగలుగుతూ ఉంటే ఎవ్వరు మట్టికి ఆ సౌకర్యాన్ని వినియోగించుకోరు చెప్పండి. "జనని జన్మ బూమిశ్చ్య, స్వర్గాదపి గరీయశి" అన్నారు కదండి మన స్వర్గం మీద మనకా స్వార్దం సహజమే కదండి.

అన్నట్టు అసలు కద ఎమిటంటే మొన్న మా అమ్మ గారు ఫొన్ చేసి, మా నాన్న గారి ఫొటో పేపరులో పడింది అంటే, ఆత్రం గా ఆన్ లైన్ లో ఈనాడు పేపరు మొత్తం వెతికి మొత్తానికి మా నన్న గారిని చూసి, ఎదో కొలంబస్ అమెరికాని కనుకున్నట్టు, మహా ఆనంద పడిపొయాను.ఆ ఆనదం ఎంత అంటే - "రాత్రి పగలు అతి కష్టపడి ఎన్నో నెలల తర్వాత ప్రాజెక్ట్ రిలీజు చెసినప్పుడు మెనెజరు దగ్గర నుండి రెండే రెండు లైన్ల (You have done a great job !!) అనె ఇ-మెయిలు చుసి నప్పట్టికన్న " వంద రెట్లు.

ఏన్నో ఏల్లు గా నిర్విరామం గా విది నిర్వహణ లో తలమునకలైన మా నాన్న గారి ని ఒక్కసారిగా ఈనాడు పేపరు లో చూసిన నాకు ఎంతో అనందం వేసింది.నా చిన్నతనం లో మా నాన్న గారు క్యాంప్ కి వెల్లీ వచ్హాను అని చెప్పినప్పుడు, అమాయకంగా ఎంత మంది ని ఖైదు చెసారు డాడీ అని అడుగుతూ, అసలు ఎందుకు ఖైదు చేసారు అని అలోచించిన రోజులు గుర్తు తెచ్హాయి.
ఆ ఆనందాన్ని మా నాన్న గారితో పంచుకోవాలనిపించి కాల్ చేస్తే, అప్పుడు అర్దం అయ్యింది - విది నిర్వహణ లో ఇలాంటివి, దీనికాన్న ఎంతో గొప్ప కేసులు చాలా సాదించినప్పటికీ కూడా పేపరు వాల్లు ఎప్పుడో నూటికి కోటికి కూడా, ఒక్కటీ సూటి గా వేయరు అని.

నా చిన్నతనం లో నాకు జిల్లా ర్యాంకు వచినప్పుడు పేపరు లో "సెంట్రల్ ఎక్సైస్ సిపాయి శేషగిరి రావు గారి అబ్బాయి అని పేపరు వారు ప్రస్తావించి నప్పుడు" నా ఫొటో నాకు చూపిస్తూ అయన పడిన ఆనదం నా కళ్ళ లో ఇంకా మెదులు తూ ఉంది. కాని ఈ సారి నేను ఆ ఆనందాన్ని పంచు కోవటానికి అయన పక్కన లేను... నా అనందం నా మాటల్లో పది కాలాలు పది మందికీ పంచుతూ ఇక్కడయినా పదిలం గా ఉంటుందని పొందు పరిచాను... అన్నట్టు డాడీ ఈ దాడి లో పాల్గొన్న మీకు, మీ సహొద్యొగులకీ మరొక్కసారి నా తరుపునుండీ నా బ్లాగు పాటకుల తరుపునండీ కూడా ఇవే మా శుభాబినందనలు....

P.S : 
ఫొన్ లో నాతో మట్లాడుతూ ఇలా అన్నారు మా నాన్న గారు - "మా కస్టంస్ శాఖ కష్ట పడుతూనే ఉంది, కాని ఈనాడు లో కనపడింది మాత్రం ఈ రొజే అని" అందుకే - "కష్టపడే కస్టంస్ ... కనపడింది 'ఈనాడు ' లో" అని రాసాను.


0 comments to "Customs in work ..found in eenadu daily"

Post a Comment

Whoever writes Inappropriate/Vulgar comments to context, generally want to be anonymous …So I hope U r not the one like that?
For lazy logs, u can at least use Name/URL option which doesn’t even require any sign-in, The good thing is that it can accept your lovely nick name also and the URL is not mandatory too.
Thanks for your patience
~Krishna(I love "Transparency")

Popular Posts

Enter your email address:

Buffs ...

Tags


Powered by WidgetsForFree

Archives